శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
354. పశుపాశ విమోచనీ | ||
వివిధ పాశములచే బంధింపబడువారిని బంధ విముక్తులను చేయునది. పాశ బద్ధః పశుః " అన్నారు. కాల పాశము చేత, కర్మపాశము చేత బద్ధులైనవారు పశువులు. జీవులమందరమూ కాల పాశానికి బద్ధులము, కర్మ పాశానికి బద్ధులము. కాలబద్ధులైన జీవులను వారి ఆయుః ప్రమాణం తీరగానే కాలపాశం వేసి, ఆ జీవుడిని లాగి యమధర్మరాజు తీసుకుని వెళ్ళి పోతాడు. అటువంటి యముని పాశాన్ని కూడా నిగ్రహించగలిగిన పరమేశ్వరి, తన భక్తులకు కర్మ బంధ పాశమునించి విముక్తి కలిగించి, సద్గతిని ప్రసాదిస్తుంది. 🙏 🌺అజ్ఞానము అన్న పాశము నుండి విముక్తి కోరుకోవాలి. |