శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
324. కళ్యాణీ | ||
శుభములను కలిగించునది సర్వమంగళా దేవి అగు పరాశక్తియే కళ్యాణీ . అంతటా ఆనందమును, శుభకరమును కలిగించే తల్లీ కళ్యాణీ. సృష్టికి మూలప్రకృతి రూపము. ఆనంద రూపిణియైన తల్లీకి నమస్కారము 🙏 🌺 మనస్సుని ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా, ప్రశాంతమైన , ఆనందభూరితమైన, శుభప్రదమైన వాతావర్నాన్ని స్థిర పరుచుకోగలుగుతాము 🌺 |