శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
318. రాక్షసఘ్నీ | ||
రాక్షసుల యొక్క సంహారము చేయునది. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అరిషడ్వర్గాలు . ఈ అరిషడ్వర్గాలు మనిషిని ఎంతటి స్థాయికైన దిగజారుస్తాయి. ఈ లక్షణాలు రాక్షస స్వభావము కలిగి వున్నవారి వెంట వస్తాయి. అమ్మ యొక్క పాదాలు శరణు కోరగా, ఈ లక్షణాలను మటుమయం చేస్తుంది, జీవుడను రక్షసిస్తుంది. అసురత్వం అన్న భావనను ఖండిస్తుంది. భండాసురుడు అన్న రాక్షసుడను సంహారస్తుంది. రాక్షసులు, దుష్టప్రభావములు నుండి రక్షసించే తల్లికి నమస్కారము 🙏 🌺 ప్రతి మనిషిలో దైవ గుణము, రాక్షసగుణములు వుంటాయి. నిజ జీవితములో మనకి కోపము కల్గించే పరిస్తుతులు ఎన్నో వస్తాయి. ధర్మము నిలపెట్టడానికి రాక్షసత్వం ప్రదర్శించాలి తప్ప ఇతరులను హింసించి ఆనందించే స్వభావము మాత్రము వుండకూడదు. ఈ నామము యొక్క మహిమ, స్మరణ వల్ల, రాక్షస స్వభావాన్ని తొక్కి పట్టి, మనలోని దైవి స్వభావాన్ని వ్యక్త పరుస్తాము. 🌺 |