శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
326. కరుణారస సాగరా | ||
అపారమైనా కరుణ గలది. తన భక్తుల పట్ల చూపెంచే కరుణ సముద్రమంత లోతుగా, విశాలముగా వుంటుంది. ఆమె కరుణకోసము ప్రారదించిన వారికి సాఫల్యము వుండకుండా పోదు. ఆమె యందు లయమే కరుణా. అపారమైనా కరుణ కలిగివున్న తల్లికి నమస్కారము 🙏 🌺 "సమాజ శ్రేయస్సే మన శ్రేయ్యస్సు." అన్న సూక్తిని పాటిస్తూ,దయా , కరుణా, ఆప్యాయంగా పరులను పలకరించడము వంటి గుణములు మనము పాటించగలుగుతాము .🌺 |