కామేశ్వర కామేశ్వరి రూపము, నాదరూపము, కామకళా రూపము అందురు.
'ఈ' కార సాంకేతముగా వున్న బీజాక్షరములు 'శ్రీం', హ్రీం, ఈం,క్లిం అన్నవి కామకళా బీజములు.ఈశ్వరునియొక్క ఇచ్చాశక్తియైన మోట్ట మోదటి రూపమే కామకళా.
ఈ కామకళా బీజం జపించడానికి, గురువునించి ఉపదేశము పొందాలి.
'క్లీం' అనే అక్షరం 'క, ల, ఈ, O' అని నాల్గింటితో కూర్పు చేయబడినది. ఈ నాల్గింటిలో 'క, ల, ఈ' లను వదిలి నాల్గవదైన బిందువుతో కూడిన నాదాన్ని ఎవరు వింటారో , పలుకు తారో వాళ్ళు ఉత్కృష్టమైన పదవిని పొందుతారని ఆగమ శాస్త్రాల్లో చెప్పబడినది.
బిందువుతో కూడిన నాదరూపమే అమ్మవారు. ఈ రూపాన్నే 'కామకళారూపం' అంటారు 🙏
🌺వివాహం , సంతానం , సంసారం జీవితంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగడం కోసం, ఈ మంత్రము సర్వ సిద్ధి ప్రధాయిని.🌺
|