శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
320. రమణలంపటా | ||
నాధుడియందు ఆసక్తి కలిగి వున్నది. రమణుడు అనగా కామేశ్వరుడు. తన భర్తయైన కామేశ్వరుడు మీద ఆసక్తి కలిగి వుండుట . తన భర్త సాంగత్యాన్ని ఇష్టపడుతుంది. లంపటము అనగా కామేశ్వరుడి సంకల్పము, తన సంకల్పంగా భావించి, ఆ సంకల్పము యందు నిమగ్నమౌవుతుంది. సర్వ వేళలా తన రమణుడుయందే ఆలోచన, అశక్తి, ప్రేమ, భాద్యత కలిగి వుండటము అన్నది పతివ్రతా లక్షణము. ప్రతి స్త్రీకి నాధుడు /రమణుడు తన భర్తయే. తన రమణుని తో ఈక్షణము విడువక సృష్టి నిర్మాణ లంపటములో భాగస్వామ్యం అయిన తల్లికి నమస్కారము 🙏 🌺కల్మషపూరితమైన ఆలోచనల నుండి మనము రక్షింపబడుతాము.🌺 |