శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
382. రహస్తర్పణతర్పితా | ||
రహస్యముగా చేయు తర్పణములచే తృప్తి చెందునది. ఆత్మ దర్శనము కలిగినప్పుడు, జీవుడికి బాహ్య ప్రపంచముతో పనిలేదు. ఏమియూ వినిపించదు, కనిపించదు. ఇది రహస్యం స్థితి, సమాధి స్థితి. ఈ స్థితిలో ధర్మ, అర్ధ, కామ, మోక్షములను ఆత్మ తర్పణముగా వదిలి పెట్టినవి, జగన్మాత తృప్తిగా స్వీకరిస్తుంది అన్నది ఈ నామము యొక్క అర్ధం.🙏 🌺జగన్మాత యొక్క నామ జపముతో,క్రమక్రమముగా మనలోని అహంకారమును , ద్వేష బుద్ధిని తర్పణచేస్తాము. 🌺 |