శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
350. వాగ్వాదినీ | ||
వాక్కు దేవత. సరస్వతి స్వరూపము. వాక్కు అన్నది అమ్మవారు లలితా పరమేశ్వరి ప్రసాదించవలసిందే. అందుకే ఆమెను ‘’వాగ్వాదిని ‘’అన్నారు. వాక్కు నుంచి వాణి ని వెలువరించే సామర్ధ్యం శ్రీ దేవికే ఉన్నది .వాగ్దేవి దయవలన లభించిన వాణి ద్వారా మనం ఆమెను స్తుతించి నమస్కరిస్తాం . నిర్మల మనస్సు ,శుద్ధ వాణి కలిసి జీవుని ముఖం పై దివ్య తేజస్సును ప్రసాదిస్తుంది. వాక్క స్వరూపిణీయైన తల్లికి నమస్కారము 🙏 🌺వాక్క సంపదను ప్రసాదించమని లలితా పరమేశ్వరిని వేడుకుందాము.🌺 |