శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
319. రామా | ||
శ్రీరాముడు. లలితాపరమేశ్వరియే శ్రీరాముడు. శ్రీచక్ర స్వరూప్పుడు రాముడు, వశిష్ఠ మహర్షి, రాముడి నామకరణము శ్రీచక్ర స్వరూప్పుడు కాబట్టి 'శ్రీ'తో మొదలబెట్టి, క్షత్రియ వంశీకుడు అని , అగ్ని తత్త్వముతో కూడిన సంబంధమైన 'ర' అన్న బీజమును , అమ్మవారియొక్క ఈ 'రామా' అన్న నామము తీసుకోని 'శ్రీరామా' అని పెట్టారు. శివశక్తియొక్క సమ్మేళనమే శ్రీ చక్రము. దాని యొక్క మూర్తియే శ్రీ రామచంద్రమూర్తి అన్న రహస్యాన్ని ఈ నామము ద్వారా మనకి తెలుస్తుంది. రామా అనగా చిదగ్ని స్వరూపిణీ. మనలో జటరాగ్ని రుపములో వుంటుంది ఆ తల్లీ.ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ఈ తారక మంత్రం జపిస్తే, సర్వ పాపములు నశించి, పుణ్య లోక ప్రాప్తి లభిస్తుంది.🌺 |