శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
372. భక్తమానస హంసికా | ||
అమ్మవారిని ఆశ్రయించిన సాధకుడు మౌనంగా అమ్మవారి ధ్యానంలో వున్నాడు అంటే 'పరా'ప్రత్యక్చితీ రూపములో భావన రూపేణ మెదిలితే 'పశ్యంతి' జప రూపేణ అంటే 'మధ్యమా', వాక్క రూపేణ అంటే 'వైఖరీ ' నాలుగు రూపాలూ కలిసి ' భక్తమానస హంసికా' ఊపిరి, ప్రాణమును యోగ శాస్త్రంలో ' హంసా' అంటారు. సాధకుడుకి జపము మనస్సు, ఊపురి తో చేస్తాడు . అంటే అమ్మవారు ఆ సాధకుడి ఊపురి, మనస్సులో తిరుగుతూ వుంటుంది. భక్తమానస అనగా అమ్మవారిని ఆశ్రయించిన సాధకుడు, హంసిక అనగా మంత్ర, జప రూపేణ. సాధకుడి మనస్సులో, జపములో కొలువై వుంటుంది అని ఈ నామము యొక్క అర్ధం.🙏 🌺ఈ నామము ద్వారా గాయత్రీ జప మహాత్యం తెలుస్తుంది. 🌺 |