శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
333. వారుణీమదవిహ్వలా | ||
పరవశత్వ స్థితిలో వున్న మనో లక్షణం కలది. యోగాభ్యాసంలో మూలాధారం నుండి సహస్రారం దాకా వెళ్ళిన కుండలినీ శక్తి, అక్కడ బ్రహ్మ రంధ్రం నుండి అమృతాన్ని స్రవించి సమస్త నాడి మండలాన్ని తడుపుతుంది. అప్పుడు కలిగే అనుభూతి పరవశత్వం! ఈ స్థితిలో బాహ్యజ్ఞానం వుండదు. దీన్ని ‘ప్రవృత్తిరహితస్థితి’ అంటారు. శరీరంలో పైకి క్రిందకి సంచరించే ‘వాయుసంచార నాడి’ వారుణికి ఈ విధమైన నియంత్రణ చేస్తే కలిగేది ఈ పరవశత్వ స్థితి. ఈ స్థితిలోని అమ్మవారిని “వారుణీ మద విహ్వలా” అందురు. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ఏకాగ్రతతో కూడిన ధ్యానము కలుగుతుంది 🌺 |