శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
316. రతిప్రియా | ||
ధ్యాన నిర్వాణ స్థితి, సమాధి స్థితి. సహస్రారము వరకు ధ్యాన స్థితిలో వున్న జ్యోతి, బ్రాహ్మశిర్షమునకు తానంతట తానుగా పైకి వెళ్తుంది. ఈ స్థితి నిర్వాణ స్థితి.ఆ తల్లికి అత్యంత ప్రియమైనది. ఈ సమాధి స్థితియే అవధూత లక్షణము. అందుకే అవధూతలలో, పరాశక్తి సర్వావస్థలో వారియందు తాండవుస్తుంది. వారి వాక్కు ప్రవచనము ద్వారా, మనకి ధర్మ మార్గాన్ని చుపిస్తుంది. ఇంకొక సామాన్య అర్ధము, మన్మధుడి భార్య రతి దేవి వంటి పతివ్రతా స్త్రీలకి ప్రియమైనది. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺లౌకిక ప్రపంచములో మానవుడు తన కర్తవ్యం నీరవర్తించడానికి, ధర్మ మార్గములో నడవటానికి ఎన్ని ఈబందులు, ఆటంకాలు ఎదురువచ్చినా,వాటిని తట్టుకొని, ధైర్యంగా వుంటూ తన లక్ష్యాన్ని చేరుకోవడమ అన్న దృఢ సంకల్పమే ఆ పరాశక్తికి ప్రీతికరమైనది.🌺 |