శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
335. వేదవేద్యా | ||
వేదములకు మాత. నాలుగు వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదములకు మాత అయిన గాయత్రీ స్వరూపము. అమ్మవారు జ్ఞాన స్వరూపిణి. వేదాలు, జ్ఞాన ప్రబోధకాలు కాబట్టి, వేదాల ద్వారా నే అమ్మవారిని తెలుసుకోగలము. వేదములద్వారా తెలుసుకోదగినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. వేదములకు అధిష్టాత్రీయైన గాయత్రీ మంత్ర స్మరణ, జపముచే ఆ తల్లీయొక్క కృపకు పాత్రులము కాగలుగుతాము🙏 🌺వేదాలు, పురాణాలలో పొందుపరిచిన సూక్ష్మాన్ని గ్రహించి, వాటి యందు ఆసక్తి చూపుతాము.🌺 |