శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
339. విష్ణుమాయా | ||
మహా మాయా స్వరూపమే విష్ణు మాయా. ఈ సృష్టి అంతా మాయా కల్పితము. మానవుడి మనస్సు మాయాతో నిండి వున్నది. మనస్సు పుట్టించే కోర్కెలతో మనం మోసపోతాము. నాది, నేను, అనే మాయలో పడి మంచి వస్తువులుకోరతాము, రోగం మరణం వద్దంటాము. మనము శ్వాస ఎలా పీల్చగలుగుతున్నాము, అదియే విష్ణు మాయా. పరాశక్తి యొక్క అనుగ్రహం. విష్ణు రూపములో ఆవహించి వున్న మాయా స్వరూపిణికి నమస్కారము 🙏 🌺ప్రాపంచిక మాయా లో పడకుండా వుండాలి. రాగం, ద్వేషం, కోపము, సుఖము, దుఃఖము వంటివే మాయా స్వరూపాలు. వాటిని జయించగలిగే అదృష్టం మనకి కలగాలి.🌺 |