శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
392. శ్రీకంఠార్థశరీరిణీ | ||
శివుని సగము శరీరములో నున్నది. శ్రీ అనగా పరాశక్తి, గరళకంఠ అర్ధశరీరము, అనగా శివునిలో సగము తానుగా వున్నది. ఈ నామరూపజగత్తు బ్రహ్మాండములో శివ భాగము సగము, శక్తి భాగము సగము అని, ఈ నామము యొక్క అర్ధము.🙏 🌺 సంకల్పములు కార్య రూపము దాల్చాలి అంటే, భార్యభర్త ( అర్ధనారితత్వం) ఇరువురి ఆలోచన పరస్పరంగా కలవాలి. అప్పుడే ఆ సంకల్పము కార్య సిద్ధి పొందుతుంది. 🌺 |