శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
325. జగతీకందా | ||
జగత సృష్టికి మూలకారణమైనది. నామరూపాత్మక జగత్తును సృష్టించుటకు శ్రీచక్రము నందు బిందు, స్పంద, ప్రతిష్పందనము త్రికోణమే... బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారి యొక్క అభివ్యక్తి జగతియైతే, దానికి కందము అంటే నాభిస్తానము నందు బిందువు ,అనగా బిందుశ్వరూపిణియే జగన్మాత. సగుణ, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి జగతికందా. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺వృక్షానికి బలమైన మూలకందము ఎట్లాగైతే గట్టి పట్టుత్వాన్ని ఇస్తుందో, అటులనే మన నడువడిక, ధర్మాచరణ ప్రవుత్తి, మూలకందము వలే మనకి రక్షగా సమాజములో ఎదురైయే సమస్యలను ధైర్యంగా ఎదురుకోగలము. విజయాన్ని సాధించగలము.🌺 |