శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
402. విద్యావిద్యా స్వరూపిణి | ||
విద్యా అంటే జ్ఞానము అవిద్యా అంటే అజ్ఞాన స్వరూపిణి. జ్ఞాన, అజ్ఞాన రెండు స్వరూపములోనూ తానే వున్నది. కనిపించే మాయా అజ్ఞానమైతే,... కనిపించని ఆత్మలో పరమాత్మ జ్ఞానము. పరమాత్మ యందు ఆసక్తి గలిగివున్న వాడికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది.🙏 🌺అవిద్య నించి విద్యను అనగా మనలో వున్న పరమాత్మను తెలుసుకొనుటకొరకు ప్రయత్నం ప్రారంభిస్తాము 🌺 |