శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
417. చేతనారూపా | ||
చైతన్య స్వరూపము. సృష్టిలో వున్న అన్ని ప్రాణులకు, తానే ఆకారము సృష్టించి, ఆకారమునకు శక్తిని ఇచ్చి, ఆ శక్తితో క్రియలను చేయించడం , ఆ క్రియ ద్వారా కర్మలను పూర్తిచేయించడం, తత్తద్వారా సత్ఫలితాన్ని ఇవ్వడం. ఇవన్నీ చేయించే జగన్నాటక సూత్రధారిణియైన పరాశక్తియే చేతనారూపా 🙏 🌺మనిషి జీవిత కాలము చాలా విలువైనది. మనకి ఆలోచన శక్తి ఉన్నందువల్ల,మనము చేసే ప్రతి క్రియ ధర్మ బద్ధముగా వున్నదా అని ఆలోచన చేసి,దానిని ఆచరణలో పెట్టాలి. సద్బుద్ధిని ఇవ్వమని ఆ దేవిని వేడుకోవాలి. 🌺 |