శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
436. కుశలా | ||
నేర్పు, కౌశల్యం కలది. సమస్త ప్రాణకోటిలో వున్న నేర్పు, ప్రతిభా అన్నియూ ఆ తల్లీవే. ప్రతిభా స్వరూపిణియే కుశలా. ఏ రకమైన వాంఛలు లేక తృప్తిగా ఉండేది. పంచకృత్యలందు, చతుషష్టికళలందు, అన్ని విషయములందు అద్వితీయమైన నేర్పరి వున్న తల్లికి నమస్కారము 🙏 🌺మనలో వుండే ప్రతిభను సమయానుకూలంగా నేర్పుతో, నైపుణ్యముతో, నలుగురికి ఉపయోగపడే రీతిగా కృషి చేస్తాము.🌺 |