శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
427. అయి | ||
అమ్మవారిని సంబోధించు పదము. ఆనందమయి,అమృతవల్లి, అది శక్తి పరాయి. ఈ కార అక్షరమే పరాబీజము. అయి లో వున్న అ కారము శివుడైతే ఇ కారము పరాశక్తి. అయి అన్న నామము సరిగ్గా ఉచ్చరిస్తే సమస్త సౌభాగ్యము మన యందు నిలుస్తుంది. అయి అని పిలవబడు తల్లికి నమస్కారము 🙏 🌺తల్లీ యొక్క నామ జప విశిష్టతను అనుభవిస్తాము🌺 |