శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
442. కుమార గణనాథాంబా | ||
కుమారస్వామికి, గణపతికి తల్లి అని అర్ధం దేవతల సెనకి అధిపతి అయిన కుమారుస్వామికి తల్లీ అయినది ఇక్కడ కుమార అంటే అహంకారం. లోకంలో అనుకునే గర్వం అనే భావం కాదు. నేను అనే స్పృహను అహంకారం అంటారు.అంబా అనగా తల్లీ . అహంకారం గల వారిని దేవి మన్నింస్తుంది. నీచమైన మన్మధ వికారాములను తొలిగించేదీ అని కూడా అర్ధం చెప్పవచ్చు. యోగ శాస్త్రంలో మూలాధారానికి అధిపతి గణపతి. అక్షరగణాలకి అధిపతి గణపతి. గణా అంటే సమ్ముహము విఘ్నాల సమ్ముహమును తులిగించే గణపతి. వీరికి మూలకారణమైన శివశక్తి (నాధా, అంబా ) స్వరూపమైన లలితాపరమేశ్వరికి నమస్కారము 🙏 🌺ఇంద్రియాలను సన్మార్గమున నడిపిస్తుంది. 🌺 |