శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
466. కాంతిమతీ | ||
కాంతివంతమైన రూపము కాంతి లేని చోట జీవిలో ప్రాణ చైతన్యము వుండదు. సత్వగుణములతో ప్రకాశిస్తూ , జీవులను తేజోమూర్తులను చేస్తుంది. సర్వ దేవతల యొక్క కాంతి రూపమే కాంతిమతీ. కాంతి అనగా శుద్ధ సత్వ, మతి అనగా మనస్సు. శుద్ధసత్వ మనస్సు కలిగివున్నది అని నామముయొక్క అర్ధం. కాంతిరూపిణియైన తల్లికి నమస్కారము 🙏 🌺కాంతిరూపిణిగా మనలో ఆలోచనా శక్తిని ప్రసాదిస్తుంది 🌺 |