శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
485. ఢాకినీశ్వరీ | ||
విశుద్ధి చక్రమునకు అధిష్టాన దేవీ ఢాకినీ. విశుద్ధి చక్రము, మన కంఠ స్థానములో నివసించి వున్నది. ఢాకినీ అన్న పేరు గల ఈశ్వరీ, కంఠ స్థానమునకు అధిదేవత. 'ఢ'కారమనే బీజ మంత్రముతో పూజింపబడి, పాయసాన్నమును ప్రీతిగా స్వీకరిస్తుంది పరమేశ్వరీ 🙏 🌺 విశుద్ధి చక్ర స్థానము సరిగ్గా పని చేయనప్పుడు కంఠమునకు సంబందించిన వ్యాధులు వస్తాయి. ఈ నామ పారాయణ శ్రద్దా, నమ్మకముతో చేసి, దేవికి పాయసాన్నమును నైవేద్యము పెట్టాలి. వ్యాధిని పూర్తిగా తగిస్తుంది 🌺 |