శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
467. క్షోభిణీ | ||
మనస్సులో వున్న చిత్తాన్ని మధించేది. ఈ జగత్తు సృష్టికి తానే సమర్ధురాలు, తన యందే అన్ని శక్తులు వున్నవి అని తెలుసుకొనుటయే క్షోభిణీ. చైతన్య జీవులయందు సంకల్పాన్ని సృష్టించి, మనస్సుకి కోర్కెలను కలిగించి , ఆ కోర్కెలు తీరక మదనపడి , క్షోభను అనుభవించి ,... మరల కోర్కెలు తుచ్ఛమని,..అవి శాశ్వతము కాదు అన్న జ్ఞానాన్ని కూడా తానే కలిగించి, ఆత్మ అన్న వెలుగును చూపించటమే క్షోభిణీ 🙏 🌺మేధో మధనముతో ఎన్నో తెలియని విషయాలకు పరిష్కారము కనబడుతుంది. 🌺 |