శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
443. తుష్టి | ||
తృప్తి, సంతోష రూపము కలది లభించినదానికి తృప్తి పడి సంతోషించడము అని అర్ధం. పరశక్తిని సేవించినవారికి, కష్టమునించి నివృత్తి కలిగించి, ఆనందాన్ని ప్రసాదిస్తుంది.సంతోషరూపిణియైన తల్లికి నమస్కారము 🙏 🌺తృప్తి అన్నది మానసిక సంపద. తృప్తిని పొందడం, తృప్తిని పంచడం అన్నవి మానవ సమాజములో అతి ముఖ్యమైనవి, విలువైనది. 🌺 |