శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
412. శిష్టపూజితా | ||
శిష్టజనుల చేత పూజింపబడునది. లలితా పరమేశ్వరీ యొక్క నామము, పూజ తెలిసి చేసినా , తెలియక చేసినా ఆ తల్లీ అందరి పూజలను అంగీకరిస్తుంది. అమ్మవారి నామము స్మరించాలి అన్న,..ఆమె పూజ చేయాలి అన్న పరాశక్తి యొక్క అనుగ్రహము వుంటేనే అది సాధ్యం. సదాచార సంపన్నులచే పూజింపబడు తల్లికి నమస్కారము 🙏 🌺మన ఆచారాలను గౌరవించి, ఆచరిస్తే , పరుల చేత గౌరవింపబడుతాము, అమ్మ కృపకు పాత్రులమౌతము🌺 |