శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
437. కోమలాకారా | ||
కోమలమైన, మెరుపుతీగ ఆకారము కలది సౌందర్యంతో కూడిన మృదువైన, సుకుమారమైన, రూపము కలది.లావణ్య స్వరూపిణియైన ఈశ్వరీ. ఈ తల్లీ సృష్టిలో వున్న అన్ని జీవరాసులలో సూక్ష్మ రూపిణిగా వుంటుంది. సూక్ష్మ రూపముతో అంతటా వ్యాపించి వున్న తల్లికి నమస్కారము 🙏 🌺సూక్ష్మరూపములో వున్న తల్లీ, మనలో ఉత్సాహన్ని , కార్య నిర్వహణా శక్తిని ప్రసాదిస్తుంది. 🌺 |