శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
413. అప్రమేయా | ||
అనంత, నిరాకార, అఖండ పరంజ్యోతి ఇంద్రియములకు అతీతమైన, మరియొక్క వస్తువుతో పోల్చుటకు సాధ్యము కానిదై, తన ప్రమాణమే తప్ప మరియొక్క సాక్ష్యము కాని,, ఉపమానముకాని లేని అఖండపదార్ధము ఏదైతే వున్నదో అదియే అప్రమేయా. "సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మా, ఏకం సత ". ఆ ఏకము కంటే పైన వున్నదేదో అదియే అప్రమేయా. నిరీశ్వర భావనతో వున్నదేదో అదియే లలితా. 🙏 🌺లలితా సహస్ర నామముల స్మరణతో, అనంతమైన శక్తి, మనలోనూ,మనచుట్టూకూడా సుదర్శన చక్రము వలే రక్షణ కలిగిస్తుంది.🌺 |