శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
482. త్వక్స్థా | ||
త్వక్'అనగా చర్మమును, 'స్థా'అనగా ఆశ్రయించి యుండునది. విశుద్ది చక్రాధిష్థాన దేవత చర్మమును ఆశ్రయించి ఉంటుంది. 'త్వక్'అంటే చర్మం 'త్వక్స్థా' అంటే చర్మమును అధి వసించి ఉంది పరమేశ్వరీ 🙏 🌺దేవిని ఆశ్రయించి,అన్న పాయసం నివేదన చేస్తే,చర్మ సమస్యలనుంచి నివారణ పొందువచ్చును 🌺 |