శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
406. శివారాధ్యా | ||
శివునిచే ఆరాధింపబడినది. తన హృదయములో పరాశక్తి యోక్క రూపమును నిలుపుకొని, తన సంకల్పాన్ని శక్తిమంతము చెయ్యటానికి చేసే పూజయే శివరాధ్యా. ఈ స్థితిలో ఆరాధించువారు, ఆరాధింపబడువారెవరో తెలియని స్థితి. శివ స్వరూపుడైనా శ్రీ రామకృష్ణ పరమహంసచే ఆరాధింపబడిన శ్రీమత శారదాదేవి కూడా శివారాధ్యా అయినది.🙏 🌺నిష్కల్మషమైన సంకల్పము, సత్బుధి, సత్తప్రవర్తన వంటి మార్గమును ఎంచుకోవాలి, లోకములో వున్న వారందరు ఈశ్వరాంశతో వున్నవారే అన్న బుద్ధిని కలగజేస్తుంది. 🌺 |