శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
473. సిద్ధవిద్యా | ||
సిద్ధిని ప్రసాదించే విద్యా స్వరూపిణి విజ్ఞాన సంపదను ఇచ్చేది. లోక సంక్షేమము కొరకు సంకల్ప జపము చేయు వారికి, సిద్ధిని ప్రసాదిస్తుంది. ఉపాసనతో పొందిన విద్యను సిద్ధవిద్యా అందురు .విద్యా రూపిణియైన తల్లికి నమస్కారము🙏 మూలాధార చక్రమునకు అధిదేవత. 🌺విద్య అన్నది గొప్ప సంపద. లోకక్షేమం కొరకు విద్యను ఉపాసిస్తే, ఆ సంపద ఇంకా పది రెట్లు పెరుగుతుంది, సిద్ధిస్తుంది. 🌺 |