శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
418. జడశక్తి | ||
ఒక స్థితిలో ఉండిపోవునట్లు చేయు శక్తి. ఒకే రకమైన గమనంలో ఉండే లక్షణాన్ని జడత్వం అంటారు. ప్రపంచంలోని నిలకడకు, స్థిర నిశ్చలతకు ఈ జడశక్తే కారణం. ఈ జడత్వ లక్షణానికి కారణమైన శక్తియే 'జడశక్తి: 🙏 🌺 ఇతర బాహ్య ప్రేరణలకు లొంగకుండా, తను ఎంచుకున్న మార్గము మరల్చకుండా, అహర్నిశలు కార్యసిద్ధి కొరకై సాధన చేసే తత్వము ఏర్పడుతుంది . 🌺 |