శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
475. యశస్వినీ | ||
సకల సంపద ప్రదాయిని అంధకారాన్ని పొగొట్టి, వెలుగును ప్రసాదించే కాంతిరూపిణి. సర్వ సిద్ధులను పొందిన తరవాత, అఖండ కీర్తిని ప్రసాదించే తల్లి. కీర్తి, గుణములు, సంపద అన్నియూ, దేవీ నించి ఉద్భవించినవే కాబట్టి ఆమె యశస్వినీ. సహస్రార చక్రమునకు అధిదేవత రూపములో వున్న యశస్వినీ దేవికి నమస్కారము 🙏 🌺సత్య కార్యాచరణ, సమర్ధత వల్ల, విశేషమైన కీర్తి సంపదను పొందగలుగుతాము . 🌺 |