శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
487. శ్యామాభా | ||
శ్యామ వర్ణము కలిగివున్నది. శ్యామ అనగా నీలము, నలుపు వర్ణము కలిగివున్నది.వర్షించే మేఘము వంటి రంగు శ్యామ వర్ణము. హృదయ స్థానము నందు శ్యామలాదేవి మహా మాయా స్వసరూపిణిగా పదహారు ఏళ్ల స్త్రీ రూపమును కలిగివుంటుంది. అనాహత చక్ర అధిష్టాత్రీ వామదేవి, శ్యామ వర్ణముతో ప్రకాశించు తల్లికి నమస్కారము 🙏. 🌺పరమేశ్వరీ యొక్క కృప తో స్వచ్చమైన మనస్సు కలిగి వుంటాము. మనస్సుతో చెడు ఆలోచనలు చేసినా, అవి సరైన ఆలోచనలు కావు , వాటికి దూరముగా వుండాలి అన్న జ్ఞాన బుద్ధిని కలిగిస్తుంది.🌺 |