శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
441. కౌళమార్గ తత్పర సేవితా | ||
కౌళాచారులచే కులమార్గంలో పూజించబడునది వంశపారంపర్యంగా వచ్చిన మార్గము కులసంబంధమైనది కాబట్టి కౌళము అనబడుతోంది. కుండలిని శక్తిని మేల్కొలిపిన సాధకులు,మూలాధారమునుండి సహస్రారము వరకు , అచ్చటనుండి తిరిగి మూలధారమునకు చేరుకునే ప్రక్రియే కౌళ మార్గ తత్పరా . వాళ్ళచే సేవలు/ పూజింపబడే తల్లీ అని అర్ధం. తంత్రశాస్త్రాల ఆధారంగా పరమేశ్వరి అర్చన చేస్తారు. వీరి ఆరాధ్య దైవమే కుండలిని శక్తియైన లలితా పరమేశ్వరి🙏 🌺వంశపారంపర్యంగా వున్న వైదిక సంప్రదాయాలను గౌరవించడము, పాటించడము ప్రారంభిస్తాము 🌺 |