శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
419. జడాత్మికా | ||
జడమునకు ఆత్మయైనది. అనగా జడము తానెయైన లలితాపరాభట్టారికయే జడాత్మికా. అస్థి(existence ) , భాతి(knowledge ), ప్రియా(happiness )నామ(name ), రూపా( form )అన్నవి ప్రకృతి లక్షణాలు. ఇందులో నామ రూపములు జడత్వానికి సంబందించినవి. చిచ్ఛక్తి నామమునకు సంబందించిన చేతనారూపా(చైతన్య రూపము ) , మరియు జడశక్తి నామమునకు సంబందించిన జడాత్మికా (ప్రకృతి రూపము) ఈ రెంటి ప్రకృతి, చైతన్య సమ్మెళనమే ఈ జగత్తు. అంటే ప్రకృతి, చైతన్య స్వరూపమే జడాత్మికా.ఈ రెంటిలో ఏ ఒక్కటి లేకపోయినా జగత్తు పరిపూర్ణ లక్షణాలు సంతరించుకోదు.🙏 🌺మనస్సుకి , బుద్ధికి ఒకే రకమైన స్థిరత్వ ఆలోచనలు కలగజేస్తుంది. 🌺 |