శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
490. అక్షమాలాదిధరా | ||
జప మాలను ధరించునది. 'అ'నుండి 'క్ష' వరకు వున్న అక్షర మాలికను ధరించినది. వాగ్దేవతా రూపిణిగా సాక్షాత్కరింస్తుంది దేవీ. సకల సిద్ధులను ప్రసాదించేది. తన చేతులయందు ఆయుధములతో పాటు జప మాలను కూడా ధరించి వున్న ఈశ్వరికి నమస్కారము 🙏 🌺 'దుష్టశిక్షణ-శిష్ట రక్షణ.' తనని నమ్ముకున్న భక్తులకు రక్షణ కలిగిస్తుంది, దుష్టులను శిక్షిస్తుంది.🌺 |