త్రినేత్రి, మూడు కన్నులు కలది
సూర్య, చంద్ర, అగ్ని అమ్మవారి కన్నులు.
జ్ఞానము ప్రసాదించుటకు, పగలు, దాత్రుత్వ స్వభావముగల,సూర్యసంబంధమైన కూడి నేత్రము.
పోషణకి ,పిండోత్పత్తికి, రాత్రి కాలము, చంద్రసంభంధమైనా ఎడమ నేత్రము,
పాపత్ములను భస్మము చేయుటకు ,భవిష్యత్ కాలమును తెలుపుటకు , ఆత్మ జ్ఞానమునకు, సంధ్యా కాలమునకు సంకేతమైన ఫాల భాగములో వున్న అగ్ని నేత్రము.
ఈ మూడు నేత్రములతో జగదంబ సృష్టి, స్థితి, లయ కు సాక్షిగా వుంటుంది . త్రినేత్ర స్వరూపిణీయైన తల్లికి నమస్కారము 🙏
🌺ప్రతి మనిషికి రెండు కళ్లు కనబడటం అన్నవి అమ్మవారియొక్క కృప. ఆమెకి సర్వదా రుణపడి వుండాలి.
రెండు కన్నులతో వస్తు/ మనిషి / ప్రకృతి యొక్క నాణ్యతను, విలువను తెలుసుకుంటాము.
మరి,.. ఆజ్ఞా చక్ర స్థానంలో వున్న మూడో కన్నుతో ఆత్మని తెలుసుకుంటాము. పవిత్రులమౌతాము.🌺 |