శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
465. కాలకంఠీ | ||
వైఖరీ వాక్కు కలది, శివ స్వరూపిణి పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ అన్నవి నాలుగు నాదస్వరూపాలు. వీటిలో వైఖరీ వాక్కుఅనగా కంఠ స్థానము లో పరాశక్తి నివసించి వుంటుంది. కంఠం నించి శబ్ద, గాన, వాక్కు రూపేణా మనందరిని కరుణిస్తుంది. "కాల" అంటే నలుపు, నీలము రంగులో వున్న కంఠము. సదాశివుడి అర్ధాంగి కాబట్టి ఆమె కాలకంఠీ.మధుర ధ్వని కలిగిన తల్లికి నమస్కారము 🙏 🌺 కంఠమునకు సంబందించిన ఆరోగ్య సమస్యలు తీరుతాయి 🌺 |