శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
478. త్రిలోచనా | ||
జ్ఞాన దృష్టి కలిగివున్నది. అమ్మవారియొక్క నేత్రములు సూర్య, చంద్ర, అగ్ని బిందు తత్వ స్వరూపములు. సృష్టిలో అన్నింటా త్రిపుటి భావన రూపిణిగా,.. కాలమును ప్రాతః, మద్యాహ్న, సాయం సంధ్యలుగా, ..అటులనే అద:, మధ్య, ఊర్ధ్వ దేశలక్షణములు, సత్వ రజస్తమో గుణములు, బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులు సృష్టి, స్థితి, లయ కారకులు. త్రిపుటిభావన లేనిదే ఈ సృష్టి వుండదు. అజ్ఞా చక్ర స్థాన మధ్యన వెలిగే వెలుగు లో తానై వున్న పరమేశ్వరియే త్రిలోచన 🙏 🌺జ్ఞాన నేత్రములతో పరిశీలనా శక్తిని పెంచుతుంది 🌺 |