శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
414. స్వప్రకాశా | ||
తనకు తానుగా ప్రకాశిస్తుంది స్వయంజ్యోతి స్వయంప్రకాశరూపిణి . సూర్యచంద్రాది ఇతరులకు ప్రకాశాన్ని ఇచ్చేది కాని, ఆ దేవికి ఎవరివల్ల ప్రకాశము కలగదు.అందుకనే ఆమె స్వప్రకాశా🙏 🌺 జ్యోతి, తను ప్రకాశిస్తూ చీకటిని తరిమెస్తుంది. అటులనే, మనలోని ఆశా జ్యోతి స్వయంప్రకాశమై, చీకటి అన్న భయాన్ని పోగొడుతుంది. 🌺 |