శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
488. వదనద్వయా | ||
రెండు ముఖములు కలిగి వున్నది అనాహత చక్ర అధిష్టాన దేవియైన వామదేవియే వదనద్వయా. రెండు ముఖములు అనగా (స్థూలరూపము, సూక్ష్మ రూపము),(జీవాత్మ, పరమాత్మ), (శ్వాస, నిశ్వాస) సంకేతమే వదనద్వయా. ఇందులో రహస్య విశ్లేషణ ఏమీ అనగా ' న'. ' ద్వయా ' అంటే రెండు ముఖములు లేనటువంటిది. అద్వైత భావన సూచిస్తున్న తల్లి అని అర్ధం 🙏 🌺మనిషి జీవితములో (మంచి, చెడు), (సుఖము, దుఃఖము), (పాపము, పుణ్యము), రెండు ముఖాలుగా భావించి జీవన ప్రయాణము సాగించాలి .అద్వైత భావనతో అంతా పరమేశ్వరీ లీలా విలాసము అని గుర్తించాలి.🌺 |