శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
457. హంసినీ | ||
శ్వాస రూపిణి ప్రాణము వలన శ్వాస , శ్వాస వలన మనస్సు చలిస్తుంది . శ్వాసని నియంత్రించి, ధ్యాన మార్గమున సహస్రారమునకు చేరిన యెడల, జ్యోతి రూపేణ హంసాకృతిగా తిరుగుతూ బ్రహ్మాకచ్చన్ని చేరుతుంది. అక్కడ మనస్సు పరమాత్మను చేరుకుంటుంది. పరమ హంసా కృతిలో వున్న పరమేశ్వరియే హంసినీ🙏. ఆత్మ పరమాత్మను తెలుసుకోవడమనే ప్రక్రియే ఈ నామం లో వున్న అంతరార్ధం. 🌺హంస ఏలాయైతే పాలలోనించి నీటిని విడదీయగలదో,. అటులనే మనము తలపెట్టిన పనిలో మంచి, చెడుల వివరణ, విచక్షణా జ్ఞానము కలుగుతుంది 🌺 |