శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
458. మాతా | ||
సృష్టికర్త్రి ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తి రూపమే సకలలోకమాతా లలితా పరమేశ్వరీ. ఆ తల్లి యొక్క సంతానమే ఈ జగత్తులో వున్న ప్రాణకోటి. మాతృ ప్రేమను కురిపించే తల్లికి నమస్కారము 🙏 🌺మన ఈ మనిషి జన్మ, తల్లీ యొక్క ప్రసాదమే. మన ప్రతి అడుగు, వాక్కు, మాత యొక్క అనుగ్రహముతో పొందినవి అన్న జ్ఞానము కలుగుతుంది 🌺 |