శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
430. నిత్యయౌవనా | ||
సర్వకాలములయందు యవ్వన దశలో వున్న తల్లీ . అమ్మవారు నిత్య యవ్వనవతి గానే వుంటుంది. కాలమునకు ఆమె అతీతురాలు కాబట్టి ఆమె నిత్యయౌవనా. సదా కాంతి స్వరూపిణిగా వుండే పరంజ్యోతికి నమస్కారము 🙏 🌺దేవి పూజారధులైన వారు, ఆ తల్లియొక్క కాంతి,వారి వాక్కునందు, సంకల్పమునందు ప్రస్ఫుటంగా కనబడుతుంది.🌺 |