శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
428. పంచకోశాంతరస్థితా | ||
పంచకోశముల మధ్య వున్నది. పంచకోశములు - 1)అన్నమయము 2)ప్రాణమయము 3)మనోమయము 4)విఙ్ఞానమయము 5)ఆనందమయము ఎపుడైతే పంచకోశములు ఒకక్కటిగా తొలగిపోతాయో అపుడు మనిషి యొక్క ఆత్మ వ్యక్తమవుతుంది. ఏవిధమైన అడ్డంకులు లేని బ్రహ్మానంద స్థితి హృదయములో ఏర్పడుతుంది.ఆ స్థితిలో పరాశక్తి కొలువై వుంటుంది. 🙏 🌺దుష్ట బుద్ధి, దుష్ట భావాల ప్రభావములో పడకుండా కాపాడుతుంది.🌺 |