శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
403. మహాకమేశనయన కుముదాహ్లాద కౌముదీ | ||
మహాకమేశ్వరునియొక్క కన్నులకు ఆహ్లాదము కలిగించే వెన్నెల వంటిది. కామేశ్వరుని యుక్క నయనము అనగా చంద్ర, అగ్ని, సూర్య. ఈ మూడు కన్నులను వెలిగింపగలిగినది, పరాశక్తి. అగ్ని బింధువు, చంద్రబిందువు, సూర్య బింధువు శ్రీచక్రఅంతరత్రికోనములయొక్క మూడు కోణములు,వాటిని వికసింపచేసేదిబింధువు. బిందుశ్వరూపిణియైన పరమేశ్వరీ మహాకమేశ్వరునియొక్క సంకల్పమునకు వికసనాన్ని కలిపిస్తుంది అని అంతరార్ధం 🙏 🌺తన భక్తులయొక్కధర్మ సంకల్పానికి,అడ్డంకులను తొలగించి,అవసరమైన మార్గములను గొచరింపచేస్తుంది . 🌺 |