శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
422. సంధ్యా | ||
గాయత్రీ స్వరూపము కాల మధ్యమున వున్న సమయమును సంధ్యా అందురు. ఉదయసంధ్యా, మధ్యాహ్న సంధ్యా, సాయం సంధ్యా, తురీయ సంధ్యా గా ఈ కాల పరిణామమును అదృశ్య శక్తిగా ప్రేరేపించే పరాశక్తియే సంధ్యా. ఉచ్చ్వాస, నిశ్వాస మధ్య వున్న ప్రాణ వాయువే సంధ్యా. స్పందన, ప్రతిస్పందన మధ్య తానే వుంటూ, సర్వ జగత్తును పరిపాలన చేస్తుంది 🙏 🌺 సమయము చాలా విలువైనది.కాలమాన ప్రకారంగా నిర్ణయించిన సమయాన్ని వృధా చేయకుండా, కొంత సమయము అమ్మవారి ధ్యాన మంత్రమును స్మరించాలి. శుభము కలుగుతుంది. 🌺 |