శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
426. త్వం | ||
పరబ్రహ్మ స్వరూపిణి తత్ అనేది పరమార్ధం .త్వం అనేది ఆ అర్ధాన్ని అభివ్యక్తం చేసే పదం. త్వం అనగా నీవు అని చెప్పదగినది. దేవి పూజ చేసేటప్పుడు, ఆమెను త్వం లేదా తుభ్యం అని పిలవబడుతుంది. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ ఓ దేవి - నీవే నా తల్లివి. నీవే నా తండ్రివి. నీవే నా బంధువు. నీవే నా మిత్రుడవు. నీవే నా విద్యవు . నీవే నా సంపదవు. నీవే నా సర్వస్వమును.🙏 🌺సర్వస్య శరణాగతి అని తల్లీ పాదాలు భక్తి తో పట్టుకుంటాము 🌺 |