శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
420. గాయత్రీ | ||
మననాత్ త్రాయతే ఇతి - మంత్రః" అంటే మననం చేసే కొలదీ రక్షించునది మంత్రం. మానవులు వివేకంతో నిర్ణయం తీసుకునేది బుద్ధితోనే కాబట్టి, అటువంటి బుద్ధులను ప్రేరేపించే దేవత గాయత్రి. కాబట్టి , గాయత్రీ అన్ని విధాలా మానవునికి అత్యంత అవసరమైన, ఆదరణనీయమైన మంత్రం. యజ్ఞోపవీత ధారణచే, ద్విజులుగా మారిన వారికి తేజస్సు, ఆరోగ్యము ప్రసాదించి, ఎల్లవేళలా కాపాడుతుంది గాయత్రీ. లలితాపరాబట్టారికాయే గాయత్రీ 🙏 🌺గాయత్రీ మంత్ర జపము వల్ల,దివ్య జ్యోతి మనలో ప్రకాశిస్తుంది. ద్విజత్వాన్ని ప్రసాదిస్తుంది.🌺 |